నకిరేకల్, వెలుగు : నకిరేకల్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన గురువారం నకిరేకల్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. బడ్జెట్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్టు చెబుతున్నా, బడ్జెట్లో చూపించినట్టు అభివృద్ధి జరగడం లేదన్నారు.
మున్సిపాలిటీలో ఒకరిద్దరు తప్ప అంతా తాత్కాలిక ఉద్యోగులు మాత్రమే ఉన్నారని చెప్పారు. మున్సిపాలిటీలో 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏ పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీకి పూర్తిస్థాయిలో శాశ్వత ఉద్యోగులను నియమించాలన్నారు. అనంతరం 2024–25 సంవత్సరపు అంచనా బడ్జెట్ ను ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చిట్యాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
నార్కట్పల్లి, వెలుగు : చిట్యాల మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలో రూ.25 లక్షలతో స్ర్టోం వాటర్ డ్రెన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల రూపురేఖలు మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.