నార్కట్పల్లి, వెలుగు : ఫైబర్ నెట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జీఎస్ ఫైబర్ నెట్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు వేర్వేరుగా అందించడం వల్ల వినియోగదారులపై భారం పడేదని, ఇప్పుడు రెండు సర్వీసులను కలిపి తక్కువ రేటుకు అందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్లైన్మార్కెట్ద్వారా అనేక అవకాశాలను పొందాలని సూచించారు. అనంతరం ఎస్సీ కమిటీ హాలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఊషయ్యగౌడ్, మాజీ జడ్పీటీసీ సత్తయ్య, మాజీ సర్పంచ్ అచ్చాలు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.