నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. చైనీస్ అక్షరాలతో ఎమ్మెల్యే ఎక్స్ ఖాతా ప్రొఫైల్ ను సైబర్ కేటుగాళ్లు చేంజ్ చేశారు. ఎమ్మెల్యే ఎక్స్ ఖాతాడీపీ పిక్చర్ ని dy468 Com పేరుతో చైనా భాషలోకి మార్చారు. ఎమ్మెల్యే బయోలో సైతం పలురకాల ఫేక్ లింక్ లను పోస్ట్ చేశారు.
తన ఎక్స్ ఖాతా హ్యక్ కు గురైనట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం వెల్లడించారు. తన ఎక్స్ ఖాతా నుంచి ఎటువంటి మెసేజ్ లు వచ్చిన రిప్లై ఇవ్వద్దన్న ఆయన తెలిపారు. డబ్బులు కావాలని ఎవరైనా ఎక్స్ వేదిక ద్వారా అడిగితే ఎమ్మెల్యే కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని వీరేశం సూచించారు. ఈ విషయంపై నకిరేకల్ పోలీసులకు క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేసింది.