వ్యవసాయ పనులు చేసిన ఎమ్మెల్యే

నకిరేకల్, వెలుగు :  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యవసాయ పనులు చేశారు. ఆదివారం ఉదయం తన వాహనంలో ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. పొలంలో వరినట్లు వేసి కూలీలతో సమానంగా దుక్కిదున్నారు. అనంతరం కూలీలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి రోజంతా పొలం పనులు చేయడం ఆశ్చర్యంగా ఉందని కూలీలు అన్నారు.