![టీచర్ల సమస్యలపై ఉద్యమించేది బీజేపీనే : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-venkataramana-reddy-made-clear-bjp-is-agitating-on-issues-of-teachers_JyCbdBPLiv.jpg)
నల్గొండ అర్బన్, వెలుగు : టీచర్ల సమస్యలపై అనునిత్యం ఉద్యమించేది బీజేపీనేనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కౌన్సిల్లో ఉపాధ్యాయుల సమస్య గొంతుకైనా పులి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యావిధానం అమలు చేసే విధంగా ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. విద్యావ్యవస్థ మార్పు చెందాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, శ్రీలతారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ఆపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.