చదువుకున్న స్కూల్‌ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

చదువుకున్న స్కూల్‌  అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డిటౌన్​, వెలుగు: ఆర్థికంగా స్థిరపడిన వారు తాము పుట్టిన ఊరు, చదువుకున్న స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.  కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన వినయ్​రెడ్డి తమ ఊరిలోని హైస్కూల్​కు రూ.లక్షతో లైబ్రరీకి బుక్స్​, ఇతర వస్తువులు అందించారు.  

గురువారం నిర్వహించిన ప్రోగ్రాంకు చీప్​గెస్టుగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ... గతంలో స్కూల్స్​, పంచాయతీ బిల్డింగ్​ ఇతర వాటికి చాలా మంది భూములు విరాళంగా ఇచ్చారన్నారు.  దాతలకు మద్దతు ఇస్తే భవిష్యత్తులో మరింత మంది సహాయ సహాకారాలు అందిస్తారన్నారు. ప్రోగ్రాంలో దాత వినయ్​రెడ్డి తండ్రీ  చంద్రారెడ్డి, హెచ్​ఎం సాయిరెడ్డి పాల్గొన్నారు.