కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోరుట్ల,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. శనివారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి,  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ లావణ్య , వైస్ చైర్మన్ పవన్,  కమిషనర్ అయాజ్, టీఆర్ఎస్ టౌన్​ ప్రెసిడెంట్అనిల్, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.గన్నేరువరం: మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 953 ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.

స్టూడెంట్స్ కు మంచి భోజనం పెట్టాలి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, వెలుగు : హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్​స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం అందివ్వాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆఫీసర్లకు సూచించారు. జగిత్యాలలోని  సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ని శనివారం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం స్టూడెంట్స్ తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ ను, భోజన వసతి సౌకర్యాలను పరిశీలించి స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట మైనార్టీ పార్టీ పట్టణాధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.

యాక్సిడెంట్​ జరిగి నెలైనా చర్యలు తీసుకోలే
న్యాయం చేయాలని రోడ్డెక్కిన మృతుని బంధువులు
మెట్ పల్లి, వెలుగు : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ యువకుడి మృతికి కారణమైన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన మృతుడి బంధువులు ఆందోళన చేశారు. శనివారం మెట్​పల్లి సర్కిల్ ఆఫీస్ ను ముట్టడించి సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 9 న మల్లాపూర్ మండలం ముత్యంపేట శివారులో గుండంపల్లికి చెందిన శివరాత్రి సాగర్(23) తన తల్లి రాజవ్వతో కలిసి బైక్​పై మెట్ పల్లి వెళ్తుండగా.. మెట్ పల్లి మండలం వెంపెటకు చెందిన నవీన్ కుమార్ ఎదురుగా బైక్​పై వచ్చి ఢీకొనడంతో సాగర్​అక్కడికక్కడే చనిపోయాడు. కాగా నవీన్ కుమార్ పై మల్లాపూర్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఘటన జరిగి సుమారు నెల కావస్తున్నా నిందితుడిపై చర్యలెందుకు తీసుకోవడంలేదని మృతుడి బంధువులు మెట్​పల్లి పోలీస్​స్టేషన్​ఎదుట ఆందోళనకు దిగారు. అయితే నిందితుడు హైదరాబాద్​గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. అనంతరం వారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు ఫిర్యాదు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో డీఎస్పీ రవీందర్ రెడ్డి అక్కడికి చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు.  

కేటాయించిన వార్డుల్లో సిబ్బంది పని చేయాలి:అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ
జగిత్యాల, వెలుగు: తమకు కేటాయించిన వార్డుల్లోనే శానిటేషన్ సిబ్బంది పని చేయాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు వార్డులో శనివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పలు వార్డులలో పారిశుధ్య పనులు, హరితహారం మొక్కలను పరిశీలించారు. రోజూ డ్రైనేజీలు, రోడ్లు క్లీన్ చేయించాలని తెలిపారు. రోడ్డు మధ్యలోని మీడియన్ మొక్కలకు ఎరువులు, వాటర్ స్ప్రేయర్ చేయించాలన్నారు. ఆమె వెంట మున్సిపల్ శానిటరీ ఇన్​స్పెక్టర్, జవాన్లు, హరితహారం కో ఆర్డినేటర్లు ఉన్నారు.

నేడు జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టులకు రాత పరీక్ష
గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్‌‌‌‌లో 177 జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ పోస్టుల ఎంపిక కోసం ఆదివారం రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 98,882 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, అధికారులు 8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.  ఈ సందర్భంగా సింగరేణి సంస్థ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ పరీక్షల పర్యవేక్షణకు 17 మంది చీఫ్‌‌‌‌ కో ఆర్డినేటర్లను, ప్రతీ సెంటర్‌‌‌‌కు ఒక అధికారిని కో ఆర్డినేటర్‌‌‌‌గా నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షలో నెగటివ్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌ విధానం ఉంటుందని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించారు. 

వీఆర్ఏల సమస్యపై స్పందించండి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ
వేములవాడ, వెలుగు : వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో 40 రోజులుగా దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వీఆర్ఏల సమస్యలపై కూడా స్పందించక పోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, కౌన్సిలర్ సంతోష్ బాబు తదితరులున్నారు.

గురుకులాల్లో రేపటి నుంచి స్పెషల్ ​డ్రైవ్: కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : గురుకుల పాఠశాలలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం వారం పాటు స్పెషల్​డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో గురుకులాల హెడ్మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 8 సాంఘిక సంక్షేమ,5 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు ఉన్నాయని వాటిల్లో సెప్టెంబర్​5వ తేదీ నుంచి వారం రోజులు స్వచ్ఛ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక లీడర్లను భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వం ఒక్కో గురుకులాని రూ.20 వేలు కేటాయించిందన్నారు. ప్రతి గురుకుల పాఠశాలకు మస్కిటో మిషన్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీపీఓ రవీందర్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రావు పాల్గొన్నారు.


ముగిసిన రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ 

తిమ్మాపూర్, వెలుగు : మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కాలేజీలో ప్రారంభమైన 2 రోజుల రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్​స్టిట్యూషన్​కు చెందిన జ్యోతిష్మతి టెక్నాలజికల్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్​పీకే. వైశాలి విజేతలకు బహుమతులు ఇచ్చారు. అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, కాలేజీ స్థాయిలో కేటగిరివారీగా బహుమతులతోపాటు రూ.25 వేల చెక్,​ 70 ట్రోఫీలకు క్యాష్ ప్రైజ్ అందించారు. ఈ టోర్నమెంట్ లో 45 స్కూలు, కాలేజీలకు చెందిన 350 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. విజేతలకు కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రెటరీ సుమిత్ సాయి అభినందించారు. కార్యక్రమంలో కాలేజీ కో ఆర్డినేటర్ మీడియా ఇన్​చార్జి విశ్వ ప్రకాశ్​బాబు, ఆర్.వెంకటేశ్వర్​రావు, జీనియస్ అకాడమీ డైరెక్టర్లు కంకటి కనకయ్య పాల్గొన్నారు. 

వాహన చట్టంపై అవగాహన ఉండాలి:జడ్జి దుర్గం గణేశ్​
గోదావరిఖని, వెలుగు: డ్రైవర్లకు మోటార్ వాహన చట్టంపై అవగాహన ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని గోదావరిఖని ఒకటో అదనపు న్యాయమూర్తి దుర్గం గణేశ్ అన్నారు. శనివారం గోదావరిఖని మార్కండేయ కాలనీ శ్రీలక్ష్మి గార్డెన్‌‌‌‌లో ఆటో, ట్రాలీ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. అంతకుముందు స్థానిక లేబర్ కోర్టు నుంచి శ్రీలక్ష్మి గార్డెన్ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు, ఇన్​స్పెక్టర్లు రమేశ్‌‌‌‌బాబు, ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌, బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. 

రాజన్న సేవలో జస్టిస్ ​వేణుగోపాల్​

వేములవాడ, వెలుగు : స్థానిక రాజరాజేశ్వరస్వామిని శనివారం జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, వేములవాడ సబ్ జడ్జి రవీందర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జస్టిస్​వేణుగోపాల్​ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో వేదోక్తంగా ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు లడ్డూ ప్రసాదం అందజేశారు. 

నగరాభివృద్ధే కార్పొరేషన్ లక్ష్యం: మేయర్ సునీల్ రావు
కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: నగరాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. శనివారం స్థానిక 9,36 డివిజన్లలో కమిషనర్ ఇస్లావత్ తో కలిసి రూ.40లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. ఈనెల 9న జరిగే వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, ఐలేందర్ యాదవ్, ఎస్ఈ నాగేమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, డీఈ ఓం ప్రకాశ్​పాల్గొన్నారు. 

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు 
కోరుట్ల,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. శనివారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్, కల్యాణ లక్ష్మి,  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్ లావణ్య , వైస్ చైర్మన్ పవన్,  కమిషనర్ అయాజ్, టీఆర్ఎస్ టౌన్​ ప్రెసిడెంట్అనిల్, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

గన్నేరువరం: మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 953 ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు, అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.

డ్రంకన్ ​డ్రైవ్ ​కేసులో ఆరుగురికి జైలు
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఏరియాలో మద్యం తాగి వెహికల్స్‌‌‌‌‌‌‌‌ నడిపిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ గోదావరిఖని కోర్టు మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌ గణేశ్ శనివారం తీర్పునిచ్చారు. రామగుండం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు కమలాకర్, నాగరాజు, రాజేందర్ సిబ్బందితో కలసి కొంతకాలంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో దొరికిన 37 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 30 మందికి రూ.వెయ్యి చొప్పున, మద్యం తాగి కారు నడిపిన ఒకరికి రూ.2 వేలు జరిమానా విధించారు. అధికంగా మద్యం తాగి బండి నడిపిన పి.సబర్‌‌‌‌‌‌‌‌, బైరీ శ్రీధర్, గాజుల శంకర్‌‌‌‌‌‌‌‌, ఎరుకల కృష్ణ, బొండకుంటి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, గద్దల నవీన్ కుమార్‌‌‌‌‌‌‌‌కు ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్షతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధించారు.

ఆర్ఎంఓను సస్పెండ్ చేయాలని ధర్నా
హుజూరాబాద్​ వెలుగు: స్థానిక ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్ఎంఓ డాక్టర్ సుధాకర్ రావును వెంటనే సస్పెండ్​చేయాలని ప్రజా సంఘాల నాయకులు శనివారం ఆస్పత్రి ముందు ధర్నా చేశారు.  ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స చేయకుండా తన సొంత క్లినిక్ కు మళ్లిస్తున్నాడని ఆరోపించారు. తమ సొంత క్లినిక్ కు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి అసుపత్రిని సందర్శించాలన్నారు. ధర్నాలో పాక సతీశ్, కొలిపాక సమ్మయ్య, ఎండి అఫ్జల్, సందెల వెంకన్న, వేల్పుల విజయ్ కుమార్, శ్రీనివాస్,  భాస్కర్,  గుడ్డేల్గుల రాజమౌళి,  గోస్కుల వెంకన్న, నవాబు పాల్గొన్నారు.

మానవతా శిఖరం గాంధీజీ: అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్
కరీంనగర్ సిటీ, వెలుగు:  సకల మానవాళి శ్రేయస్సు కోరే గొప్ప మానవతా శిఖరం గాంధీజీ అని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. శనివారం గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను అంగీకరించి ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో డా:అశోక్,  గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత కళింగ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

టీచర్‌‌‌‌‌‌‌‌పై దాడి బంగారం, నగదు చోరీ
గోదావరిఖని, వెలుగు: స్థానిక గాంధీనగర్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌లో టీచర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా చున్నంబట్టివాడకు చెందిన ఎం.రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ మెడలోని బంగారం చైన్‌‌‌‌‌‌‌‌, నగదును దొచుకెళ్లిన ఘటన గోదావరిఖనిలో జరిగింది. గోదావరిఖని సీఐ రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు కథనం ప్రకారం.. రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ శనివారం బస్టాండ్‌‌‌‌‌‌‌‌ సమీపంలో టీ తాగి స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నపుడు ప్రేమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, మరో ఇద్దరు మైనర్లు కలిసి టీచర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేశారు. రాయితో కొట్టి చంపుతామని బెదిరించి మెడలోని బంగారం గొలుసు, రూ.మూడు వేలు లక్కున్నారు. వెంటనే రాజేశ్వర్​పోలీసులను ఫిర్యాదు చేయగా వారు బస్టాండ్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో పరిశీలించారు. ఆ సమయంలో ప్రేమ్‌‌‌‌‌‌‌‌కుమార్ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి తులం బంగారు గొలుసు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మైనర్లను పట్టుకుంటామని సీఐ తెలిపారు.