బీఆర్ఎస్ లీడర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ఎమ్మెల్యే విజయ రమణారావు

బీఆర్ఎస్ లీడర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఆందోళనలు చేయడం మాని, ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. గ్రామసభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు మిస్ అయిన అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తులపై తక్షణమే విచారణ చేసి, అర్హులను ఎంపిక చేస్తారన్నారు.

 బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా ఇండ్లు, రేషన్ కార్డులు అందించలేదని, ఇప్పుడు ఆందోళన చేసేముందు వారి పాలనను గుర్తుచేసుకోవాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు గొల్లపల్లి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని, గ్రామానికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే చిన్నమ్మ మృతి పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ 

సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిన్నమ్మ చింతకుంట కళావతి(86) వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో మంగళవారం చనిపోయారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎలిగేడు మండల కేంద్రంలో కళావతి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళావతి కుటుంబ సభ్యులను, ఎమ్మెల్యేను ఆయన పరామర్శించారు.