
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్, రంగాపూర్, సబితం, అందుగులపల్లె, సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో గురువారం పీఎసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఓదెల మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూముల రికార్డులకు సంబంధించి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో భూభారతిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, లీడర్లు మహేందర్, అబ్బయ్య గౌడ్, చిలుక సతీశ్ పాల్గొన్నారు.