అభివృద్ధి పనుల్లో అవినీతిని సహించం : విజయ రమణారావు

  • ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో అవినీతిని సహించేది లేదని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల 13వ వార్డులో రూ.38 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే రూ.15 కోట్లతో పనులు చేపట్టామన్నారు. 

ఈ పనుల్లో అవినీతికి తావు లేకుండా నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌పర్సన్ గాజుల లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్లు సాయిరి మహేందర్, అబ్బయ్య గౌడ్, డి.దామోదర్ రావు, సిద్ధతిరుపతి, కిశోర్‌‌, రాజేందర్ పాల్గొన్నారు.