బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు

బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, అయినా పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి సోమవారం పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని చెప్పారు. అలాగే మండలంలోని కాట్నపల్లి గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి పోలింగ్ సరళిని పరిశీలించారు.