సుల్తానాబాద్‌‌‌‌‌‌పట్టణ రూపురేఖలు మారుస్తా : విజయరమణారావు

సుల్తానాబాద్‌‌‌‌‌‌పట్టణ రూపురేఖలు మారుస్తా : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు:  సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి పట్టణ రూపురేఖలను మారుస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. అమృత్ 2.0 ప్యాకేజీ1 ద్వారా సుల్తానాబాద్ లో రూ.18.41 కోట్లతో నిర్మించ తలపెట్టిన వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని శివారు ప్రాంతాలకు సైతం రక్షిత మంచినీరు అందిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో ఇప్పటికే అభివృద్ధి పనులకు రూ.9కోట్లు  కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కౌన్సిలర్లు, అధికారులు ఉన్నారు.