పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే విజయరమణారావు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించి వెంటనే పూర్తిచేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు  అన్నారు. పెద్దపల్లి మున్సిపల్​ పరిధిలోని 15వ వార్డులో ఇటీవల టీయూఎఫ్‌‌‌‌ఐడీసీ నిధులు రూ. 35.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో దాదాపుగా రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

ఇప్పటికే రూ.10 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇంకా రూ.20 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ ఈర్ల స్వరూప, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్‌‌‌‌, లీడర్లు శ్రీనివాస్, స్వరూప, మల్లయ్య, సంపత్, శ్రీను, శంకరయ్య  తదితరులు పాల్గొన్నారు.