అప్పులను అధిగమించి గ్యారంటీలు అమలు చేస్తాం : విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు: బీఆర్ఎస్​రాష్ట్రాన్ని రూ.6.70 లక్షల కోట్ల అప్పులపాలు చేసిందని, నిధులను సమీకరించుకుంటూ ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కందునూరుపల్లె గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుకట్ట రోడ్డుతో పాటు గ్రామంలో ఇతర అభివృద్ధి పనులను విడతలవారీగా చేపడతామని హామీ ఇచ్చారు. ఎంపీపీ బాలాజీ రావు, సర్పంచ్ స్వరూప తిరుపతి, లీడర్లు ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, పన్నాల రాములు, శ్రీగిరి శ్రీనివాస్, దామోదర్ రావు, చిలుక సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అబ్బయ్య గౌడ్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.