సుల్తానాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో శనివారం వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్, షాదిఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
మానేరు వాగు నుంచి లారీల ద్వారా ఇసుక తరలిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. లీడర్లు మినుపాల ప్రకాశ్‌రావు, లీడర్లు కోడెం సురేఖ, అజయ్, శ్రీగిరి శ్రీనివాస్, డి.దామోదర్ రావు, సతీశ్ పాల్గొన్నారు.