ఎమ్మెల్యే విఠల్​రెడ్డిని  నిలదీసిన గ్రామస్తులు

కుభీర్, వెలుగు : తమ ఊరికి ఇంత వరకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం రాలేదని, ఎందుకింత చిన్నచూపు చూస్తున్నారంటూ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని కుభీరు మండలంలోని నిగ్వ గ్రామస్తులు నిలదీశారు. ఎల్లమ్మ గుడి భూమిపూజకు ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి మంగళవారం గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న దళితులు ఆయన కారును అడ్డుకున్నారు. ఇంత వరకు తమ గ్రామానికి ఒక్క డబుల్​బెడ్రూం ఇల్లు మంజూరు కాలేదన్నారు.

గుంట భూమి లేని దళితులు చాలా మంది ఉన్నారని, ఇప్పటి దాకా ఎవరికీ మూడెకరాల భూమి రాలేదని వాపోయారు. తమకు దళితులకు ఎందుకు దళిత బంధు రావడంలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. స్పందించిన విఠల్​రెడ్డి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.