
- పదేండ్లలో పూర్తికాని పనులను ఏడాదిలో చేసినం
- నిధులు మంజూరు చేసినా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు
- మేం గెలిచిన వెంటనే ఏడాదిలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నం
- అనుకున్న టైమ్‌లో పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని వెల్లడి
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: క్యాతనపల్లి రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్వోబీ) ప్రారంభంతో ప్రజల 12 ఏండ్ల కల సాకారమైందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం క్యాతనపల్లి ఆర్వోబీని పదేండ్లు పట్టించుకోలేదని, నిధులు మంజూరు చేసినా కనీసం భూసేకరణ కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు.
తాము గెలిచిన వెంటనే ఏడాదిలో బ్రిడ్జిని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని, ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రైల్వే గేటు వద్ద రూ.35 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని వివేక్, వంశీకృష్ణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లిద్దరినీ స్థానికులు, కాంగ్రెస్ నాయకులు ఎత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్కుమార్దీపక్, పీసీసీ జనరల్సెక్రటరీ రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్టౌన్ప్రెసిడెంట్ పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, సీనియర్లీడర్లు మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్‌గౌడ్, అబ్దుల్అజీజ్, గాండ్ల సమ్మయ్య, యాకుబ్ అలీ, మెట్ట సుధాకర్, మాజీ మున్సిపల్చైర్పర్సన్జంగం కళ, వైస్చైర్మన్సాగర్రెడ్డి పాల్గొన్నారు.
టార్గెట్ పెట్టుకుని పూర్తి చేసినం: వంశీకృష్ణ
క్యాతనపల్లి ఆర్వోబీ ప్రారంభంతో ప్రజల కల నెరవేరిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ‘‘నాడు పెద్దపల్లి ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి.. ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రంతో మాట్లాడి ఆర్వోబీ మంజూరు చేయించారు. కానీ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ బ్రిడ్జి లేక ప్రజలు చనిపోతుండడం బాధేసింది. మేం గెలిచిన వెంటనే బ్రిడ్జి పనులు పూర్తి చేయించడమే టార్గెట్‌గా పెట్టుకున్నం.
అనుకున్న టైమ్‌లో పనులు పూర్తి చేయించి ప్రారంభించాం” అని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా కాకా మనుమడిగా మంచి గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కనీసం రూ.10 వేలు వచ్చేలా కృషి చేస్తానని, ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించానని పేర్కొన్నారు. రవీంద్రఖని రైల్వే స్టేషన్‌లో అజ్ని రైలు హాల్టింగ్ కోసం కృషి చేస్తానన్నారు. నేషనల్హైవే 63 విస్తరణకు జోడువాగుల వద్ద ఫారెస్ట్పర్మిషన్ వస్తుందని, నేతకాని భవనం కోసం తన ఎంపీ ల్యాడ్నుంచి రూ.15 లక్షలు కేటాయించినట్టు చెప్పారు.
ఎమ్మెల్యే, ఎంపీకి సన్మానం..
క్యాతనపల్లి ఆర్వోబీ పనులు పూర్తి చేయించి, ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణను వివిధ రాజకీయ పార్టీలు, కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సన్మానించారు. మరోవైపు గతంలో క్యాతనపల్లి రైల్వే గేటును దాటుతూ రామకృష్ణాపూర్‌కు చెందిన సురేశ్, చందు అనే ఇద్దరు చనిపోయారు.
తమను ఆదుకోవాలని, గత బీఆర్ఎస్పాలకులు పట్టించుకోలేదని బ్రిడ్జి ప్రారంభోత్సవ మీటింగ్‌లో ఎమ్మెల్యే, ఎంపీని సురేశ్ కుటుంబసభ్యులు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వివేక్.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభం..
తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి, పోన్నారం, నాగాపూర్, సోమనపల్లిలో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలుసెంటర్లను ఆయన మంగళవారం ప్రారంభించారు. నాగాపూర్, సోమనపల్లిలో సీసీ రోడ్లను ప్రారంభించారు. సోమనపల్లిలో ‘జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్’ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దళారులకు అమ్ముకుని రైతులు నష్టపోవద్దని సూచించారు.
ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నదని చెప్పారు. కాగా, అసనాద్గ్రామంలో జరిగిన ఎల్లమ్మ పట్నాల్లో వివేక్ పాల్గొని పూజలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణాపూర్‌కు చెందిన సీనియర్‌కాంగ్రెస్ లీడర్ గోపతి రాజయ్యను పరామర్శించారు. చెన్నూరు మండలం పోన్నారంలో ఇటీవల కరెంటు షాక్‌తో మృతి చెందిన కర్ణాల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
త్వరలోనే రోడ్ల రిపేర్లు: వివేక్
క్యాతనపల్లి వద్ద ఆర్వోబీ లేక ఇన్నేండ్లు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. ‘‘నాడు పెద్దపల్లి ఎంపీగా నేను ఉన్నప్పుడు ఆర్వోబీ కావాలని ప్రజలు అడిగారు. అప్పటి రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గేతో మాట్లాడి క్యాతనపల్లి, రామగుండంలో ఆర్వోబీలను మంజూరు చేయించాను. రామగుండంలో ఆర్వోబీ పూర్తి కాగా, క్యాతనపల్లి ఆర్వోబీని గత బీఆర్ఎస్ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలేదు.
ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా వంశీకృష్ణ గెలిచిన తర్వాత ఆర్వోబీ పనులు పూర్తి చేయించడంపై ఫోకస్ పెట్టాం. భూసేకరణ, ఇతర సమస్యలన్నీ పరిష్కరించి ఏడాది కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఆర్వోబీపై ఇంకా లైటింగ్, సేఫ్టీ పరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. సేఫ్టీ నేపథ్యంలో మరో 20 రోజల వరకు సాయంత్రం 6 గంటల తర్వాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తారు. ఇందుకు ప్రజలు సహకరించాలి” అని కోరారు.
చెన్నూరు నియెజకవర్గంలో రోడ్ల రిపేర్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.70 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చెన్నూరు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.