ఫస్ట్​ మ్యాచ్​లో బెల్లంపల్లి టీమ్​ విక్టరీ .. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సాయికృష్ణ

ఫస్ట్​ మ్యాచ్​లో బెల్లంపల్లి టీమ్​ విక్టరీ .. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సాయికృష్ణ

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్​లోని ఏఎంసీ–2 గ్రౌండ్​లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట మొదలైన క్రికెట్​టోర్నమెంట్ ఫస్ట్​మ్యాచ్​లో బెల్లంపల్లి టీమ్15 రన్స్ తేడాతో నెన్నెల మండల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెల్లంపల్లి టీమ్​20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

సాయి కృష్ణ 48 బాల్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 65 రన్స్ చేశాడు. కిషన్ 22, చిన్న, బీమాయుక్త చెరో14 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెన్నెల టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. రాజేశ్ మలోత్ 24 బాల్స్​లో 34 రన్స్, సాయికుమార్ 21, అనిల్ గోలేటీ 18 పరుగులు చేశారు. బెల్లంపల్లి ఆటగాడు సాయికృష్ణ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు.