
- క్రికెట్‌కు కాకా కుటుంబం ప్రోత్సాహముంటుంది
- పద్మశాలీ కుల సంఘం భవనానికి భూమి ఇప్పిస్తా
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : క్రికెట్క్రీడకు కాకా కుటుంబం ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, క్రీడాకారుల టాలెంట్‌ను గుర్తించేందుకు పోటీలు నిర్వహిస్తున్నామని చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ జి.వివేక్‌వెంకటస్వామి, గడ్డం వినోద్, కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ-2 గ్రౌండ్లో నియోజకవర్గస్థాయి కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలు, ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కాకా వెంకటస్వామి స్మారక జాతీయస్థాయి కరాటే, యోగ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాకా వెంకటస్వామి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్రికెట్ పోటీల్లో నియోజకవర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, వేమనపల్లి, కాసిపేట, తాండూర్, కన్నెపల్లి మండలాలకు చెందిన 40 జట్లు పాల్గొంటున్నాయి. మొదటి మ్యాచ్ బెల్లంపల్లి-, నెన్నెల జట్లు జరగ్గా ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, యువ నేత వంశీకృష్ణ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.
కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యోగా, కరాటే పోటీల నిర్వహణ చైర్మన్ మునిమంద రమేశ్, కో చైర్మన్ ఎనగందుల వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, మున్సిపల్ మాజీ చైర్మన్లు మత్తమారి సూరిబాబు, మునిమంద స్వరూప, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ మహేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి, నెన్నెల జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో బెల్లంపల్లి జట్లు విజయం సాధించింది.
పద్మశాలీ సంఘం క్యాలెండర్ల ఆవిష్కరణ
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఎంఆర్ గార్డెన్స్‌లో పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళానికి చీఫ్ గెస్టులుగా ఎమ్మెల్యే వివేక్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. కుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాకు లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు.
క్యాతనపల్లి పద్మశాలీ కుల సంఘం భవనం, ఆలయం కోసం భూమిని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అతిథులను నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో క్యాతనపల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్వనం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గాదాసు బాబు, గౌరవ అధ్యక్షుడు గడ్డం సుధాకర్, జిల్లా కార్యదర్శి వేముల వీరస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బూర సారంగపాణి, స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బొద్దుల మల్లేశ్, ఆడెపు లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.