23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

తిరుపతిలో 2025, మార్చి 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాయలసీమ జేఏసీ నాయకులు అశోక రత్నం, మధుసూదన్, అజయ్ కుమార్, అనిల్ తదితరులు బుధవారం (మార్చి 19) నెహ్రూ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‎లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ కరపత్రాలను నేతలు విడుదల చేశారు. 

Also Read :- ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాదు .. ట్రిలియన్ డాలర్ల అప్పు చేస్తారు

అనంతరం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ మాలల సింహ గర్జన సభకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. మాలల హక్కుల కోసం రాయలసీమ జిల్లాల నుండి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమిలేయర్ తీర్పును రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని నేతలు హెచ్చరించారు.