రోడ్ల మరమ్మతులకు ఫండ్స్ ఇవ్వండి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రోడ్ల మరమ్మతులకు ఫండ్స్ ఇవ్వండి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • మంత్రి కోమటిరెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వినతి
  • కొత్త రోడ్లు, బ్రిడ్జిలు సాంక్షన్ చేయండి
  • వర్షాలతో రోడ్లు కొట్టుకుపోయినయ్
  • ప్రజలు ఇబ్బందులు  పడ్తున్నారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.57.20 కోట్ల నిధులు శాంక్షన్ చేయాలని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని ఎమ్మెల్యే వివేక్ కోరారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్​లో కొత్త రోడ్లు, బ్రిడ్జిలతో పాటు మరమ్మతులకు సంబంధించిన పనుల వివరాలను మంత్రికి అందజేశారు. మొత్తం 12 వర్క్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్​రెడ్డితో వివేక్ అరగంట పాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయని, కొన్ని చోట్ల మొత్తం కొట్టుకుపోయాయని తెలిపారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు.

కోటపల్లి నుంచి పర్పల్లి వరకు రోడ్డు మరమ్మతులు, ఇందారం నుంచి కుందారం వరకు హైలెవల్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు. లింగన్నపేట గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జి, చెన్నూరు నుంచి వేమనపల్లికి వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. వీటితో పాటు మరికొన్ని చోట్ల రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి వెంకట్​రెడ్డిని ఎమ్మెల్యే వివేక్ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఆర్ అండ్ బీ ఈఎన్సీకి ఈ ప్రతిపాదనలు పంపి త్వరలోనే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.  చెన్నూరు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులకు రూ.21 కోట్లు సాంక్షన్ చేయాలని ఆ శాఖ మంత్రి సీతక్కను వివేక్ వెంకటస్వామి కోరారు. కాగా, చెన్నూరు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీ రాజ్ రోడ్ల మరమ్మతులకు రూ.21 కోట్లు శాంక్షన్ చేయాలని ఆ శాఖ మంత్రి సీతక్కను వివేక్ కోరారు.