ఇఫ్తార్‌‌‌‌ విందులో ఎమ్మెల్యే వివేక్‌‌

ఇఫ్తార్‌‌‌‌ విందులో ఎమ్మెల్యే వివేక్‌‌

జైపూర్‌‌‌‌, కోల్‌‌బెల్ట్‌‌, చెన్నూరు  వెలుగు :  జైపూర్ మండలం ఇందారం జామ మజీద్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫయాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలతో  కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు.  ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

బాధిత కుటుంబానికి పరామర్శ 

గుండె పోటుతో మృతి చెందిన చెన్నూరు పట్టణానికి చెందిన వ్యాపారి ప్రేమ్ చంద్ దేవుడా భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నూతన వధూవరులకు వివేక్ ఆశీర్వాదం

మంచిర్యాల జిల్లాలో జరిగిన పలు వివాహ వేడుకలకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.  రామకృష్ణాపుర్ కు చెందిన జర్నలిస్ట్ దుస్సా ప్రసాద్ కుమారుడు శశాంక్ ప్రహర్ష- ఫిలియ పెండ్లి వేడుకలు,ఎమ్ ఎన్ ఆర్ గార్డెన్స్ లో భీమా మానస-మహేశ్వర్ ల పెళ్లి , అమ్మ గార్డెన్స్ జరిగిన శ్రావణి-రాజ నరేంద్ర వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. నస్పూర్ మండలంలోని పివి ఆర్ గార్డెన్స్ లో కామెర నూతన్ కుమార్-ప్రత్యక్ష, జైపూర్ లో రిక్కుల జితేందర్ రెడ్డి -ప్రత్యూష రెడ్డి, చెన్నూరు లో సన్వీతరెడ్డి-దేవేందర్ రెడ్డి, కాళేశ్వరం లో జరిగిన చెన్నూరు కాంగ్రెస్ లీడర్ అంకా గౌడ్ మనవడు వెంకటేశ్​– -సుష్మిత వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 

కోల్ బెల్ట్/జైపూర్,వెలుగు: జైపూర్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ లో  చేరారు. గురువారం జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుబ్బపల్లి ఉపసర్పంచ్ తిరుమల వాసు, వార్డు సభ్యులు జాడి రవి, రాజ్ కుమార్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బానేశ్ లకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువాలు  కప్పి ఆహ్వానించారు.