మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే వివేక్ పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే వివేక్  పరామర్శ

చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలం కత్తెరశాల బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓతు కులపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కంకణాల దేవేందర్రెడ్డి, ఎండీ సైఫ్ చనిపోగా, వారి కుటుంబాలను ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి పరామర్శించా రు. 

విషయం తెలుసుకున్న ఆయన హుటాహు టిన హైదరాబాద్ నుంచి చెన్నూరు చేరుకున్నా రు. మండలంలోని ఓతుకులపల్లి గ్రామంలో దేవేందర్రెడ్డిని, చెన్నూరు పట్టణంలో సైఫ్ డెడ్ బాడీలకు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అనారోగ్యంతో చనిపోయిన బీరెల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

సైఫ్ డెడ్్బడీ వద్ద వివేక్ వెంకటస్వామి, ఓదెలు ఎమ్మెల్యే వెంట మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లీడర్లు మూల రాజిరెడ్డి, ఫయాజ్, బాపగౌడ్, మహేశ్ తివారి, రాజమల్లు గౌడ్, సుశీల్ కుమార్, చెన్నూరి శ్రీధర్, చింతల శ్రీని వాస్ ఉన్నారు.