చెన్నూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్

 చెన్నూర్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వివేక్

కోల్​బెల్ట్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో నాలుగు దశాబ్దాలుగా కాకా వెంకటస్వామి కుటుంబం ప్రజలకు సేవలందిస్తోందని, చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ పనిచేస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​లీడర్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా ప్రెసిడెంట్​బండి సదానందం యాదవ్ ​అన్నారు. ఎమ్మెల్యే వివేక్ ఆదేశాలతో బుధవారం మంచిర్యాల లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 78 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మందమర్రి టౌన్ ​కాంగ్రెస్ ​ప్రెసిడెంట్​నోముల ఉపేందర్ ​గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ జనరల్​ సెక్రటరీ సొత్కు సుదర్శన్, నీలయ్యతో కలిసి సదానందం మాట్లాడారు. క్యాతనపల్లి, చెన్నూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో డ్రికింగ్​వాటర్​సమస్యను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఢిల్లీలో సంబంధిత మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లి, అమృత్​ స్కీమ్​ కింద మూడు మున్సిపాలిటీలకు రూ.100 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. క్యాతన పల్లి, చెన్నూర్​లో నిర్మాణ పనులకు శంకుస్థాప

నలు కూడా చేశారన్నారు. నేషనల్​ హైవే 63 కొత్త రోడ్డు, విస్తరణకు రూ.100 కోట్లు మంజూరు చేయించారని గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. లీడర్లు గాదె రాంచందర్​ రాజేశ్​ నాయక్, బూడిద శంకర్, పెద్ది రాజన్న, చిరంజీవి పాల్గొన్నారు.