సంగారెడ్డి: మాల జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. నౌ ఆర్ నెవర్ అన్నట్లే పోరాడాలని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 2024, నవంబర్ 16వ తేదీన సంగారెడ్డిలో మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాలలం ముప్పై లక్షల మంది ఉన్నాం. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కులం మనది.. కానీ మనకు దక్కాల్సినవి గుర్తింపు దక్కడం లేదు.. హక్కుల కోసం మాలలు ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు.
మన బలం కోసం మాత్రమే మనం కొట్లాడాలని.. ఇతరుల బలహీనతలపై కాదని అన్నారు. మన బలం ఏంటో మనం చూపించుకునేందుకే 2024, డిసెంబర్ 1న హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని.. మాలలంతా హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏ రాజకీయ సమావేశాలు ఇంత క్రమశిక్షణతో జరగవని.. మాలల ఆత్మీయ సమావేశాలు చాలా చక్కగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
ALSO READ | నవంబర్ 23న సిరిసిల్లలో మాలల బహిరంగ సభ .. హాజరుకానున్న వివేక్ వెంకట స్వామి
మాలల హక్కుల కోసం పోరాటం చేస్తోన్న తనపై కొందరు బురద జల్లుతున్నారని.. నా మీద బురద జల్లుతున్నారంటే మనం సక్సెస్ అయినట్లేనని అన్నారు. నా పై ఒత్తిడి ఉందని.. అయినా మాలల హక్కుల కోసం వెనక్కి పోయేది లేదని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. పదవుల కోసం పాకులాడనని.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎలాంటి పదవులు తీసుకోకుండా కొట్లాడానని.. ఇప్పుడు కూడా మాలల హక్కుల కోసం కొట్లాడుతున్నానని అన్నారు. నేను ఏదైనా పోరాటం ప్రారంభించిన తరువాత విజయం సాధించే వరకు వదలనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.