రాజకీయంగా ఇబ్బంది ఉన్నా.. మాలల కోసం రిస్క్ తీసుకున్నా: ఎమ్మెల్యే వివేక్

రాజకీయంగా ఇబ్బంది ఉన్నా.. మాలల కోసం రిస్క్ తీసుకున్నా: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని.. వారి కోసం ఏం చేయకపోయిన ఎవరూ నోరు మెదపరనే అభిప్రాయం అన్ని పార్టీల రాజకీయా నాయకుల్లో ఉందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 2024, నవంబర్ 23వ తేదీన గండిపేట్‎లో మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే వివేక్ ప్రసంగించారు. మాలల కోసం పోరాడేందుకు తాను బయటకు వచ్చానని.. నాకు రాజకీయంగా ఇబ్బంది ఉన్నా మాలల కోసం రిస్క్ తీసుకున్నానని చెప్పారు. 

మాలల కోసం పోరాడితే కొందరు తనను విమర్శిస్తున్నారని.. మన పోరాటం చూసి వాళ్లలో గుబులు మొదలైందని అన్నారు. మాలలు అంతా కలిసి బయటకు వస్తే మన సత్తా ఏంటో చూపించుకోవచ్చని పిలుపునిచ్చారు. న్యాయం వైపు నిలబడాలని తన తండ్రి కాకా వెంకటస్వామి ఎప్పుడు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కూడా మాలల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారన్నారు.

మాలల కోసం చేస్తోన్న పోరాటంలో తనకు ఎమ్మె్ల్యే నాగారాజు మద్దతుగా నిలుస్తారని చెప్పారు. నాగర్ కర్నూల్‎లో నిర్వహించిన మాలల మీటింగ్‎కు 50 వేల మంది వస్తారని ఊహించలేదని.. అదే జోష్‎తో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‎లో జరగనున్న మాలల సింహగర్జన సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మాలల జాతి గౌరవం కోసం నిరంతరం పోరాటం కొనసాగించాలని సూచించారు.