కాళేశ్వరం పైసలతో.. పేదలందరికీ ఇండ్లు వస్తుండే: ఎమ్మేల్యే వివేక్

కాళేశ్వరం పైసలతో.. పేదలందరికీ ఇండ్లు వస్తుండే: ఎమ్మేల్యే వివేక్
  •  కేసీఆర్ రూ. లక్షా 25 వేల కోట్లు వృథా చేసిండు 
  • మేము పేదల సొంతింటి కలను నిజం చేస్తం 
  •  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

కోల్ బెల్ట్: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకట స్వామి అన్నారు. కేసీఆర్ లక్షా 25 వేల కోట్లను కాళేశ్వరంతో వృథా చేశారని, ఆ పైసలతో రా ష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే అవకాశం ఉండేదన్నారు. కాళేశ్వరం లేకున్నా ఈ సారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరిని సాగు చేశారని తెలిపారు. 

ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేస్తుందని చెప్పారు. 'రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాలేదు.. అయినా కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తుంది. రేషన్ కార్డు ల్లో పేర్లు లేవని ఆందోళన చెందవద్దు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తం' అని తెలిపారు.