రాములోరి తలంబ్రాలకు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే వివేక్

కోల్ బెల్ట్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాల కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆర్టీసీ కార్గో ద్వారా పేరు నమోదు చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాలలో చెన్నూరు బస్ట్​స్టాండ్​ కార్గో ఇన్​చార్జి బంధారుకంటి పున్నం, సిబ్బందిని ఎమ్మెల్యే కలిశారు. రాములోరి కల్యాణానికి  భద్రాచలం వెళ్లలేని భక్తులు ఒక పాకెట్ కు రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో ద్వారా  తలంబ్రాలను పొందవచ్చని వివేక్​ తెలిపారు. ఈ నెల 18 వరకు ఆన్​లైన్ లోనూ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చన్నారు. కార్గో సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి తలంబ్రాలను అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 8978756611 నంబర్​ను సంప్రదించాలని ఆర్టీసీ కార్గో సిబ్బంది సూచించారు.