కమీషన్ల కోసమే రూ. 8లక్షల కోట్ల అప్పు చేశారు: ఎమ్మెల్యే వివేక్

కమీషన్ల కోసమే రూ. 8లక్షల కోట్ల అప్పు చేశారు: ఎమ్మెల్యే వివేక్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే  లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ మండలంలోని ఒత్కుల పల్లె గ్రామంలో జై భీమ్ జై బాపు సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాదయాత్ర చేశారు  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..రాహుల్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహిస్తున్నానని చెప్పారు. 

పదేండ్లలో  బీఆర్ఎస్  8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు.  కేవలం కమీషన్ల కోసమే ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ తిరిగిన కనీసం రోడ్లు కూడా లేవు.  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది.  అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాము. పొక్కూర్ గ్రామంలో 260 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.  అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం మాఫియా ఉండేది. సన్న వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుంది. నేను మొన్న కిష్టంపేటలో సన్న బియ్యం వండితే తిన్నా. కానీ కొంత మంది బీఆర్ఎస్ నాయకులు పాత దొడ్డు బియ్యం చూపి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హెచ్ సీయూ భూముల విషయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఫొటోలు పెట్టీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎలెక్షన్ లలో ఇచ్చిన మాట ప్రకారం అని రంగాల్లో అభివృద్ధి చేస్తాను.  

అర్హులైన ప్రతీ ఒక్కరు యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లోన్ తీసుకొని మంచి బిజినెస్ చేసి అభివృధి చెందాలి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పైన 10 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది. రేషన్ కార్డుల గురించి అందరూ నన్ను అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో అందరికీ  డిజిటల్ రేషన్ కార్డులిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ నిధులు పెంచింది. ఈ 15 నెలల్లో నేను 900 సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. చెన్నూర్ మండలం సోమనపల్లిలో రూ. 250 కోట్ల  ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోంది.  నియోజకవర్గంలో చాలా స్కూల్ లలో అన్ని మౌలిక వసతులు కల్పించేలా 10 కోట్ల రూపాయలు కేటాయించాను. పది సంవత్సరాల నుంచి టీచర్లు లేక ఇబ్బందులు పడ్డారు. రేవంత్ రాగానే టీచర్లను రిక్రూట్ చేసి ఇబ్బందులు లేకుండా చేశారు.  రూ.3 కోట్ల మీ గ్రామానికి బీటీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. ఒత్కుల పల్లె శ్మశాన వాటికలకు సరిగా రోడ్లు లేవు.  ఒత్కుల పల్లె స్మశానవాటికకు త్వరలో రోడ్డు వేయిస్తా అని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.