బషీర్ బాగ్, వెలుగు: అబిడ్స్ ట్రూప్ బజార్ లో కల్చర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దళిత ఉద్యమ నేత, ఎస్సీ హక్కుల ప్రొటెక్షన్ అధ్యక్షునిగా పనిచేసిన ఆవుల బాలానందం 20 ఏండ్ల కింద ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలుపెట్టినట్లు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి గుర్తుచేశారు.
బాలానందం చనిపోయాక, ఆయన కుమారులు ఆవుల సుధీర్ బాలానందం, ఆవుల కృష్ణ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తొమ్మిది రోజులు అన్నదానంతోపాటు, మహిళలకు చీరలు పంపిణీ చేయడాన్ని మెచ్చుకున్నారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.