ఎస్సీ కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి సహకరించాలి : గ్యాంగ్​ హన్మంతు 

ఎస్సీ కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి సహకరించాలి : గ్యాంగ్​ హన్మంతు 

నారాయణపేట, వెలుగు:    దామరగిద్ద మండల పరిధిలో మల్​రెడ్డి పల్లి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి సహకరించాలని జాతీయ మాలల ఐక్యవేదిక వర్కింగ్​ ప్రెసిడెంట్​ గ్యాంగ్​ హన్మంతు చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ను కలిసి విన్నవించారు. శనివారం హైదరాబాద్​లోని వివేక్​ నివాసంలో కలిసి మాలల సమస్యలపై చర్చించారు. నారాయణపేటలో మాలల ఐక్యత కోసం పనిచేయాలని ఎమ్మెల్యే కోరినట్టు హన్మంతు తెలిపారు.

కమ్యూనిటీ హాల్​ నిర్మాణానికి సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతకుముందు మాలలకు జనాభా ప్రకారం రిజర్వేషన్​ కల్పించేటట్టు కృషి చేయాలని ఐక్య వేదిక రాష్ట్ర ఉపాద్యక్షుడు అవుల సుధీర్​కుమార్​, రాష్ట్ర కార్యదర్శి రంగాతో కలిసి స్పీకర్​ గడ్డం ప్రసాద్​కు కలిసి వినతిపత్రాన్ని అందించారు.