దళితుల ఎదుగుదల కోసమే ఎస్సీ రిజర్వేషన్లు : ఎమ్మెల్యే వివేక్

దళితుల ఎదుగుదల కోసమే ఎస్సీ రిజర్వేషన్లు : ఎమ్మెల్యే వివేక్

దళితుల ఎదుగుదల కోసమే ఎస్సీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి .  కూకట్ పల్లి అంబేద్కర్ పార్క్ ముందు ఉన్న ప్రాంతంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినివాళులు అర్పించారు. 

ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్.. అంబేద్కర్ షెడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన సింగూర్ నర్సింలు కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.  అంబేద్కర్ పేద ప్రజలకు హక్కులు సాధించడంలో ముందున్నారని తెలిపారు.  దళితుల ఎదుగుదల కోసం ఆనాడు అంబేద్కర్ కృషి చేసి రిజర్వేషన్స్ తీసుకొచ్చారని చెప్పారు.  ఇతరులతో సమానంగా ముందుకు వెళ్లేలా అంబేద్కర్  హక్కులు కల్పించారని తెలిపారు.  జాతి కోసం ఎదో ఒక పని చేసేందుకు ముందుకు వచ్చి భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే వివేక్.

Also Read:-మిషన్​ భగీరథ స్కీమ్.. ​అతిపెద్ద స్కామ్