కోల్బెల్ట్: యువకుడైన పెద్దపల్లి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి వంశీ కృష్ణను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరులో వంశీకృష్ణ కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంశీకి మెజారిటీ వస్తే హైకమాంఢ్ వద్ద దేని కోసమైనా అడిగే ధైర్యం ఉంటుందన్నారు.
త్వరలో చెన్నూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూరు ను మోడల్ నియోజకవర్గంగా మార్చుతానన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను నుంచి పోటీ లేదన్నారు. వంశీ గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ మెజారిటీ సాధించాలని సూచించారు. చెన్నూర్ నుంచి వంశీకి అత్యధిక మెజారిటీ ఇవ్వాలన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కేవలం ఎలక్షన్ల సమయంలోనే ఇక్కడ తిరుగుతున్నాడని మండిపడ్డారు.