మన గురించి రాజకీయ పార్టీల్లో చర్చ ఎందుకు జరగట్లే: MLA వివేక్ వెంకట స్వామి

ఎస్సీ వర్గీకరణ అనేది తప్పు నిర్ణయమని MLA వివేక్ వెంకట స్వామి అన్నారు. మాలల గురించి రాజకీయ పార్టీల్లో ఎందుకు చర్చ జరుగుట్లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. పెట్టి మాలలు బయటకి వచ్చి, సత్తా ఏంటో.. మన సంఖ్య ఎంతో చూపించాలని చెన్నూర్ ఎమ్మె్ల్యే పిలుపునిచ్చారు. రెండు నెలల నుంచి మాలలను తక్కువ చేసి, హీనంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో 30లక్షల మంది మాల కమ్యూనిటీతో రెండు స్థానంలో ఉన్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. 

అంబేద్కర్ దారిలో మాలలు నడుస్తూ మన హక్కులు కాపాడుకోవాలని వివేక్ వెంకట స్వామి సూచించారు. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మాలల సింహగర్జనకు తెలంగాణలో అన్నీ జిల్లాల నుంచి భారీ ఎత్తున మాలలు తరలిరావాలని కోరారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు110 అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేశానని చెప్పుకొచ్చారు.