సింహగర్జన సభకు 30లక్షల మంది మాలలు హాజరు కావాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరగనున్న మాలల సింహగర్జన సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనుకుంటున్నారని..  అందుకే చిన్న చూపు చుపిస్తున్నారని అన్నారు. మాలల ఆత్మగౌరవం కోసమే మేము సభ ఏర్పాటు చేసుకుంటున్నామని.. మేము ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వివేక్. మాలల సింహగర్జన సభకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని అన్నారు.

మాలలు 30 లక్షల మందివి ఉన్నారని.. మాలలకు హక్కులు కల్పించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. డిసెంబర్ 1 జరిగే మలాల సభను విజయవంతం చేయాలని.. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సభకి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. 

తెలంగాణ లో ఉద్యమం లో కొట్లాడిన సమయంలో ఈడి రైడ్ లు జరిగాయని, మొన్న కెసిఅర్ ను గద్దె డించే వరకు కొట్లాడాడం జరిగిందని అన్నారు. కులం, జాతి కోసం మాలలంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా ముందుకు వచ్చానని అన్నారు. సభ సక్సెస్ అవ్వాలి అంటే త్యాగాలు చేయాలని.. అందరు వస్తేనే సభ సక్సెస్ అవుతుందని అన్నారు వివేక్ వెంకటస్వామి.