పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. శారద నగర్ లోని ఈద్ గాహ అహ్లేహదీస్ లో జరిగిన రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు వివేక్, మక్కన్ సింగ్ ఠాకూర్.
పెద్దపల్లిలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఈద్గా క్వారీ రోడ్ లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర జామా మసీద్ రంజాన్ వేడుకల్లో పాల్గొననున్నారు ప్రేమ్ సాగర్ రావు, వంశీకృష్ణ.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు వివిధ మసీదులలో నమాజ్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదుకు నమాజ్ చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముస్లిం సోదరులు. నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత నిన్న ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో దేశంలో పలు ప్రాంతాల్లో రంజాన్ వేడుకులు జరుపుకుంటున్నారు.