మందా జగన్నాథానికి వివేక్ వెంకటస్వామి నివాళి

దిల్‌సుఖ్​నగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా మందా జగన్నాథం పాత్ర మరువలేనిదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చంపాపేటలోని జగన్నాథం ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మందా జగన్నాథం కొడుకు శ్రీనాథ్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. జగన్నాథం ఫొటో వద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ.. మందా జగన్నాథం తనకు అత్యంత సన్నిహితులని, ఆయన మరణం దళిత జాతికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన సమయంలో ప్రతిచోట జగన్నాథం ముందు నడిచి పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే చాలు.. ఎంపీ సీటు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత అని ప్రణబ్ ముఖర్జీకి అల్టిమేటం చేసిన వ్యక్తి జగన్నాథం అని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.