మంచిర్యాల:పేదవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్యంపై దృష్టిసారించిందన్నారు.
చ్చిన మాట ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి లక్షా 50వేల లోపు రుణమాఫీ చేశారని.. ఆగస్టు 15 లోపు 2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీ అందరికి అందలేదంటూ కొందమంది రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారు. రానీవారు పేర్లను లిస్టు రాసి పంపిస్తే లబ్ధిదారులకు తప్పకుండా రుణమాఫీ జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరుహామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు.
మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణాకు తావులేదన్నారు. ఎవరైనా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపట్ల విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు కఠినంగా ఉండాలని ఆదేశించారు. ఇసుక క్వారీలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
టీవల అక్రమాలకు పాల్పడిన ఐదుగురు సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.