
ముషీరాబాద్, వెలుగు: దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పిలుపునిచ్చారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర సమాచార మాల మహానాడు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే వివేక్మంగళవారం సిటీలో ఆవిష్కరించారు.
దేశ ప్రజలందరికి సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కిందన్నారు. అనంతరం బాగ్ లింగంపల్లిలోని తన ఆఫీసులో గోపోజు రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఆయనతో కొండ్ర రాజలింగం, కృష్ణమూర్తి, శ్రీకాంత్, అనిల్, చేతన్ కుమార్ ఉన్నారు.