బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు:  ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ల గడ్డకు చెందిన కులదురహంకార హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంటి ( కృష్ణ ) కుటుంబాన్ని  ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, భార్గవిని మూడేండ్లు ప్రేమించి పెండ్లి చేసుకున్న కృష్ణను యువతి అన్నలు, వారి స్నేహితులు కలిసి దారుణంగా హత్య చేయడం చూస్తుంటే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామని అనిపిస్తుందని అన్నారు.డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు వివేక్ వెంకటస్వామి.  ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని.. తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు.హత్య పూర్వాపరాలను పరిశీలించి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చూడాలని అన్నారు. కృష్ణ కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ఐదెకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి  డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి.

Also Read :- గుడిసెలోకి దూసుకెళ్లిన కారు.. నాలుగేళ్ళ బాలుడు మృతి..

కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని..  రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటానని ... నిందితులకు శిక్ష పడే విధంగా సీఎం తో మాట్లాడుతానని అన్నారు వివేక్ వెంకటస్వామి.