
మందమర్రిలో రెండవ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.. మందమర్రి, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి పరిధిలోని గ్రామాల ప్రజల సౌకర్యార్థం సమస్యలు తెలిపేందుకు వీలుగా రెండవ క్యాంప్ ఆఫీసు ప్రారంభించినట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా భూభారతి చట్టం అమలవుతుందని అన్నారు ఎమ్మెల్యే వివేక్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు తీరుతాయని.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారం కాకా ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి పోర్టల్ లో పట్టా భూములు కూడా ప్రోభిటేడ్ ఏరియాలో చూపించేదని.. గతంలో ఉన్న భూ సమస్యల కంటే ధరణి పోర్టల్ ద్వారా కొత్త సమస్యలు వచ్చాయని అన్నారు.
►ALSO READ | ‘పాలమూరు’ నీటి లభ్యతపై మరోసారి స్టడీ: జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపు కోసం పార్లమెంట్ లో లేవనెత్తడం అభినందనీయమని.. ఎంపీ వంశీ కృష్ణ కృషి తో కేంద్ర ప్రభుత్వం 140 కోట్లు సింగరేణి పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ కు జమ చేయడం జరిగిందని అన్నారు. పదివేల పెన్షన్ ఇచ్చేంతవరకు తన పోరాటం ఆగదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారని.. సింగరేణి కార్మికుల సమస్యల పట్ల పోరాటం చేస్తున్న వంశీకి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.