చెన్నూరులో కొత్త గురుకుల స్కూల్ కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే వివేక్

చెన్నూరులో కొత్త గురుకుల స్కూల్ కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే వివేక్

చెన్నూరు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్ డీఎఫ్, డీఎంఎఫ్ టీ, డీఎంఎఫ్ టీ, సీఎస్ఆర్ నిధులతో  నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తానని చెప్పారు. గురుకులాలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన ఉందన్నారు.  నియోజకవర్గంలో మరో కొత్త గురుకులం స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని.. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు.

2024, జూలై 5 తేదీన జైపూర్, భీమారం మండలాల్లో వన మహోత్సవం కార్యక్రమాలను ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ. అనంతరం ఎంపీపీ భవన్ నిర్మాణానికి, భీమారం మండలం నర్సింగాపూర్ లో రు.3కోట్లతో నిర్మించే 33కేవి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేశామన్నారు.  చెన్నూరులో బోర్లు వేయించి నీటి కొరతను తీర్చామని ఎమ్మెల్యే చెప్పారు. మిషన్ భగీరథ పథకం.. ఓ ఫెయిల్ పథకమని విమర్శించారు.  ఒక్క ఇంటికి కూడా చుక్క నీరు సప్లై కాలేదని మండిపడ్డారు.
జైపూర్ లోని ఎంపీపీ భవనం శిథిలా వ్యవస్థకు చేరుకుందని.. తన నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తున్నానని ఆయన చెప్పారు.