మెట్‌పల్లి, వెలుగు: కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా.. అదానీ, అంబానీల కోసమే పని చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. అందులో భాగంగా బడా పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆరోపించారు.
సోమవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నిర్వహించిన గ్రామ దేవతల పూజారులు, పంబాల, దేవట పోతురాజుల, బైండ్ల, కోలుపుల, అసాది కుల సంఘాల ఐక్య వేదిక ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగరావుతో కలిసి పాల్గొన్నారు.