
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వెళాల గ్రామంలోని గట్టు మల్లన్న కొండ పైకి నడుచుకుంటూ వెళ్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అంబేద్కర్ కళాశాల చైర్మన్ సరోజా వివేక్. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు.
శివరాత్రి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని మడ్ల రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పరమశివుడి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. పెద్దపల్లి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు వంశీ .