కొమ్ముర గ్రామంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం

 కొమ్ముర గ్రామంలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం
  • పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం పంపిణీ

కోల్ బెల్ట్, వెలుగు: రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని చెన్నూరు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్​ బాపాగౌడ్, మాజీ జడ్పీటీసీ కరుణసాగర్​ రావు, కాంగ్రెస్ ​నేత హేమంత్​రెడ్డి అన్నారు. సోమవారం చెన్నూరు మండలం కొమ్ముర గ్రామంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సన్నబియ్యంతో పేదల ఆకలి తీరనుందని అన్నారు. 

అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు కుంట శంకర్, రాజాగౌడ్, పవన్​ తదితరులు పాల్గొన్నారు.