వేలాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు : వివేక్​ వెంకటస్వామి

వేలాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు : వివేక్​ వెంకటస్వామి
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తం: వివేక్​ వెంకటస్వామి
  • ఆలయం వద్ద ఏర్పాట్ల పరిశీలన

 

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​మండలం వేలాల గట్టు మల్లికార్జునస్వామి జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఎమ్మెల్యే చెప్పారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించి.. ఏర్పాట్లపై సంబంధిత ఆఫీసర్లతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి రోజున ప్రతి ఏటా వేలాల జాతరను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. 

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. గుట్ట మీద ఉన్న మల్లికార్జునస్వామి ఆలయ ఆవరణలో కాంక్రీట్ రోడ్డు, ప్లాట్​ఫాం నిర్మాణం, సోలార్​బోర్​కు మోటార్​బిగింపు పనులు పూర్తయ్యాయన్నారు. 

వేలాల పుష్కర ఘాట్​వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, బాతింట్​ఘాట్​వద్ద టెంట్, ఇతర సదుపాయాలు కల్పించాలని కలెక్టర్​కు సూచించామని, ఆ పనులు కూడా కొసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 

జగదాంబేశ్వరి తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే

మందమర్రి మండలం కొత్త తిమ్మాపూర్​లోని జగదాంబేశ్వరి ఆలయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సందర్శించారు. దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా చేపట్టిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయంతో పాటు గోశాల, వేదపాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆ తల్లి ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ఆశ్రమ నిర్వాహకులు వొన్నోజుల రామేశ్వరాచార్య, నరేశ్​శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం మంచిర్యాలలో నూతన వధూవరులు సిటీ కేబుల్​యజమాని దీపేశ్​రేణ్వా సోదరుడు ఆకాశ్ రేణ్వా-, అదితి.. జైపూర్​ మండలం మిట్టపల్లిలో గోదారి రాయలింగు, -మహేశ్వరిని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. చెన్నూరు మండలం సుందరశాలకు చెందిన గుండ శ్రీనివాస్​రెడ్డి, -ప్రేమలత దంపతుల కూతురు కావ్యరెడ్డి పెండ్లి నేపథ్యంలో ఆమెను ఆశీర్వదించారు. ఆ తర్వాత మంచిర్యాల హైటెక్​ సిటీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో వివిధ కులసంఘాల లీడర్లు ఎమ్మెల్యేను కలిశారు. 

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు పరామర్శ 

అనారోగ్యంతో కొద్దిరోజులుగా సికింద్రాబాద్​యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగితెలుసుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అండగా ఉంటానని భరోసా కల్పించారు.