ఎస్సీ ప్రొటెక్షన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆవుల బాలనాధం సేవలు మరువలేనివన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల కోసం నిరంతరం పోరాటాలు చేశారన్నారు. పేరడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహించాలని ఆయన ఎఫ్పుడు అనేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన అందరి మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
తాము ఇటీవల నిర్వహించిన సింహగర్జన సభతో మాలల్లో ఛైతన్యం వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాలల కంటే మాదిగలే ఎక్కువగా నష్టపోతార్నారు వివేక్. హైదరాబాద్ అబిడ్స్ లో జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో..నిర్వహించిన బాలనాధం 79వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి.