
కోల్‌బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు: డాక్టర్బీ.ఆర్. అంబేద్కర్ ఆశయమైన కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్జయంతిని పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్, రామకృష్ణాపూర్ కాంగ్రెస్ ఆఫీస్, వారాంతపు సంత, భీమారం, చెన్నూరు, జైపూర్ మండలంలోని పెగడపల్లిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీలు సతీశ్‌కుమార్, వెంకట్రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్మూల రాజిరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
పంచశీల జెండాలను ఆవిష్కరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన కోసమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ విగ్రహాలు ఆయనకే ఉన్నాయన్నారు. చదువుకుంటేనే సమాజంలో కుల వివక్ష పోతుందన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించేందుకు కాకా వెంకటస్వామి అంబేద్కర్ పేరుతో కాలేజీని స్థాపించారని, అందులో వేల సంఖ్యలో విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్లు ఇస్తున్నట్లు చెప్పారు.
బాధిత కుటుంబాల పరామర్శ
రామకృష్ణాపుర్ అల్లూరి సీతారామరాజునగర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన నల్లగొండ కొమురయ్య, గంపల రాయనర్సు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్ మధు కుమారుడు అమరదీప్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమ్మగార్డెన్ ఏరియాకు చెందిన గోపతి బానేశ్ బర్త్‌డే వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ హాజరై వారిని ఆశీర్వదించారు. జైపూర్ మండలం వేలాల గ్రామంలో కాంగ్రెస్ లీడర్ ఓగ్గు శంకర్ మనవరాలు నామకణోత్సంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.