- బైక్‌పై వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి రూరల్/జైపూర్/చెన్నూర్, వెలుగు : కాంగ్రెస్ సర్కార్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగ సమస్య నిర్మూలనే మొయిన్ఎజెండాగా పనిచేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరుఫున బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం మైలారం, కొత్తూరు, ఘనపూర్తోపాటు చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలోని కిష్టాపూర్, వేలాల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో జరిగిన కార్నర్ మీటింగుల్లో వివేక్ మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, సమస్యలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారని.. అందుకే ఆ ఇద్దరిని ఓడించి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పా రని అన్నారు. పోడు భూముల పట్టాల సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించామని, త్వరలోనే అందరికీ పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. నెన్నెల మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో పనులు చేస్తున్న ఈజీఎస్ కూలీలను కలిసేందుకు ఎమ్మెల్యే వివేక్ స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్‌లోకి గోమాస శ్రీనివాస్ సోషల్‌మీడియా ఇన్చార్జ్
జైపూర్ మండల పరిధిలో పలువురు బీఆర్ఎస్మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పెగడపల్లి మాజీ సర్పంచి రిక్కుల రాజమణి రాంరెడ్డి, లీడర్లు, వెంకటరావుపల్లి, దుబ్బపల్లి యువకులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ సోషల్‌మీడియా ఇన్చార్జి సునార్కర్ రాంబాబు తదితరులు చేరారు.
వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారాలు
వంశీకృష్ణకు మద్దతుగా మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారాలు చేపట్టారు. అభిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో మందమర్రిలోని మారుతీనగర్ లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు ఇంటింటి ప్రచారం చేశారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ వార్డుల్లో, చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో
ఇంటింటింటికీ తిరుగుతూ కాంగ్రెస్పథకాలను వివరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూలరాజు రెడ్డి, హిమవంత రెడ్డి, బాబా గౌడ్, అంకాగౌడ్, పాల్గొన్నారు. భీమారం మండలం ఖాజీపల్లెలో గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం చేపట్టారు.