మహిళల హక్కులు, కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మహిళల హక్కులు, కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వివేక్. జై భీం స్లోగన్ చెప్తుంటే అంబేద్కర్ గుర్తు వస్తారని.. అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వసమ్ ఉన్న వ్యక్తి, అంబేద్కర్ అంటే ధైర్యం.. పేద ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.మహిళల హక్కులు, కార్మికుల కోసం కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ఎమ్మెల్యే వివేక్. 

కుల వివక్ష ఉన్న కూడా జాతి కోసం అంబేద్కర్ నిలిచారని.. గాంధీతో కలిసి బ్రిటిష్ వారితో కోట్లడిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అన్నారు. మనము కూడా జాతి కోసం పాటు పడాలని..అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. 75 ఏండ్ల తర్వాత కూడా ఇంకా కుల వివక్ష ఉందని.. మంచి కల్చర్ నేర్చుకొని మనం  కూడా అందరితో పోటీ పడాలని అన్నారు.

ALSO READ | టైర్ 2,3 నగరాలకూ ఐటీ విస్తరిస్తం:శ్రీధర్ బాబు

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయడంలో చాలా మంది కృషి ఉందని.. అప్పటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టిన విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని..మనం ఐక్యంగా ఉండి పోరాడాలని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.